ఛీ… అడుక్కునే ఆమెపై గ్యాంగ్ రేప్

ఛీ... అడుక్కునే ఆమెపై గ్యాంగ్ రేప్

0

తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినా కూడా కామాంధులలో భయంలేకుండా పోయిందనిపిస్తోంది…. తాజాగా రాష్ట్రంలో మరో దారుణం జరిగింది… కడుపునింపుకోవడానికి రోజు చిల్లర అడుక్కునే 60 ఏళ్ల మహిళను గ్యాంగ్ రేప్ చేశారు …

ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. హైదరాబాద్ మల్కాజ్ గిరి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఆ మహిళను చిన్నప్ప, విజయ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మాటల్లో పెట్టి తన ఇంటికి తీసువెళ్లి ఆమెకు మద్యం తాగించారు….

ఆమె స్పృహ కోల్పోవడంతో ఈ ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు… కొద్ది సేపటి తర్వాత ఆమెకు స్పృహ రావడంతో గట్టిగా కేలకలు వేసింది… దీంతో ఈ ఇద్దరు వ్యక్తులు భయపడి పారిపోయారు…. స్థానికంగా ఉన్న వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు…