భర్త పై సంచలన వ్యాఖ్యలు చేసిన చెన్నకేశవులు భార్య

భర్త పై సంచలన వ్యాఖ్యలు చేసిన చెన్నకేశవులు భార్య

0

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ దిశా హత్యాచారం కేసు లో దోషులుగా వున్న నలుగురు నిందితులని కొద్ది రోజుల క్రితం తెల్లవారుజూమున పోలీసులనుంచి తప్పించుకునే సమయంలో వారిని ఆత్మ రక్షణలో భాగంగా, పోలీసులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. అయితే నిందితుల బంధువులు మాత్రం కోర్టు తీర్పు రాకముందే ఎలా చంపుతారని ధర్నాలకు దిగారు..

చివరకు ఈ కేసు కోర్టు వరకూ వెళ్లింది, అయితే నలుగురి నిందితుల కుటుంబానికి ఇఫ్పుడు మానవ హక్కుల సంఘం వారు సపోర్ట్ చేస్తున్నారు మీకు న్యాయం చేస్తాము అంటున్నారు. ఈనిందితులల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక సంచలన ఆరోపణలు చేసింది.

ఈ దుర్మార్గులు దిశ ఘటనకు ముందు చాలా దారుణాలు చేశారు అని పోలీసుల విచారణలో తేలింది.. సుమారు 9 ఘటనలకు వీరు ఇలాగే పాల్పడ్డారు అని పోలీసులు తెలుసుకున్నారు.. ఈ విషయంలో మొత్తం సమాజం వారిని నిందిస్తోంది, ఈ దుర్మార్గులకు సరైన శిక్ష ఇదే అని అంటున్నారు, తన భర్త ఇలాంటి తప్పులు చేసి ఉండడు.. కావాలనే పోలీసులు చెబుతున్నారు. ఆయన చాలా మంచోడు అంటోంది చెన్నకేశవులు భార్య.
అయితే దీనిపై పోలీసులు కూడా పూర్తి సాక్ష్యాదారాలతో కోర్టులో ఎవిడన్స్ సబ్ మీట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు,