చెర్రీ సినిమాకి నిర్మాతగా పవన్‍‍… దర్శకుడిగా త్రివిక్రమ్

చెర్రీ సినిమాకి నిర్మాతగా పవన్‍‍... దర్శకుడిగా త్రివిక్రమ్

0

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి ..మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు చేస్తారు అని అంటే మరికొందరు ఆయన సినిమాల్లో నటించరు అంటున్నారు.. అంతేకాదు ఆయన సినిమా రంగాన్ని వదలకూడదు అని తాజాగా నిర్ణయించుకున్నారట.. నటనే కాదు మిగిలిన క్రాఫ్ట్ లో కూడా ఆయనకు ఎంతో అనుభవం ఉంది, అందుకే ఆయన దర్శకుడు అవుతారు అనే టాక్ నడుస్తోంది.

కాని పవన్ కల్యాణ్ దర్శకత్వంతో పాటు సిని నిర్మాణంలోకి దిగాలి అని భావిస్తున్నారట.. గతంలో దర్శకుడుత్రివిక్రమ్ తో కలిసి సినిమా నిర్మాణాలు చేద్దాము అని అనుకున్నారు.. వీరిద్దరూ జాయింట్ ప్రొడక్షన్ పెడతారు అని వార్తలు వచ్చాయి, చిన్న సినిమాలు నిర్మిస్తారు అని టాక్ నడిచింది. కాని అది వాస్తవ రూపం దాల్చలేదు.

ఇక త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి పవన్ నిర్మాతగా మారుతున్నారు అని తెలుస్తోంది, మరి పవన్ నిజంగా నిర్మాతగా మారితే చిన్న దర్శకులకు మంచి అవకాశం కల్పిస్తారు అని తెలుస్తోంది, సో చూడాలి ఆయన నిర్మాతగా ఈ సినిమా చేస్తారో లేదో. టాలీవుడ్ లో చర్చ మాత్రం జరుగుతోంది.