చెత్త అనుకుని బంగారు నగల బ్యాగ్ పడేసింది- చివరకు ఏమైందంటే

చెత్త అనుకుని బంగారు నగల బ్యాగ్ పడేసింది- చివరకు ఏమైందంటే

0

దీపావళి పండుగ కదా అని ఇళ్లు అంతా ఆమె శుభ్రం చేయించింది, పాత సామాన్లు పనికి రాని వస్తువులని వెంటనే పక్కనపడేశారు, అంతేకాదు ఈ చెత్త బ్యాగులు ఇవన్నీ మున్సిపల్ డంపింగ్ వ్యాన్ వస్తే ఆ చెత్త బండిలో వేసేశారు, తీరా తర్వాత తెలిసింది ఏమిటి అంటే.. ఆ చెత్త బ్యాగులో ఏకంగా బంగారు వస్తువులు ఉన్నాయి, దీంతో కంగారుపడి వెంటనే మున్సిపల్ అధికారులకి తెలిపారు.

డంప్ యార్డ్ లో పడేసిన తర్వాత పాపం ఉద్యోగులకి ఏమీ తెలియదు కదా..మహారాష్ట్రలోని పూణేలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. రేఖ అనే మహిళ దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్న సమయంలో మూడు లక్షల విలువైన బంగారం ఉన్న పాత సంచిని చెత్తలో పడేసింది ఇక తర్వాత గుర్తు వచ్చి షాక్ అయింది.

ఇక వెంటనే మున్సిపల్ సిబ్బందితో మాట్లాడితే దాదాపు అక్కడ వారు అందరూ వెతికారు ..దాదాపు 18 టన్నుల చెత్త తొలగించి వెతికి ఆ బ్యాగును గుర్తించి ఆమెకి ఇచ్చారు, ఆమె ఎంతో సంతోషించింది. అయితే పాత సంచుల్లో కొందరు బంగారు నగలు పెడుతూ ఉంటారు, ఇలా వారి కుటుంబం కూడాపెట్టింది, చివరకు ఇలా ఘటన జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here