చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే

చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే

0

జనసేన పార్టీకి చెందిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చిక్కుల్లో ఉండిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…. రేపటి నుంచి ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి… ఈ సమావేశాల్లో రాపాక ఏ పక్షాణ మాట్లాడాలో అర్థం కానీ పరిస్థితి…

ఇక వైపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై కారాలు మిర్యాలు నూరుతున్నారు… ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై ఉద్యమాలు చేస్తున్నారు… గత నెల 3న విశాఖలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ ను కూడా నిర్వహించారు… మరో వైపు ఆయన ఎమ్మెల్యే వైసీపీకి మద్దతు గా నిలుస్తున్నారు…

జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్నారు… ఇటీవలే జగన్ ఫోటోకు పాభిషేకం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు రాపాక… మరి ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏం చేస్తారనే దానిపై ప్రతీ ఒక్కరిలో ఉత్మంఠనెలకొంది… గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి జై కొట్టారు మరి రేపు జరుగబోయే సమావేశాల్లో ఎటువైపు నిలుస్తారో చూడాలి… మొత్తానికి రాపాకకు ఈ వ్యవహారం కత్తిమీద సామే అన్నట్లు తయారు అయింది…