చిరంజీవి వేదాలం సినిమాకు ముహూర్తం ఫిక్స్ ఎప్పుడంటే

చిరంజీవి వేదాలం సినిమాకు ముహూర్తం ఫిక్స్ ఎప్పుడంటే

0

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన రెండు ప్రాజెక్టులు ఒకే చేశారు, ఆయన ఎందులో నటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో ఆయన వేదాలం రీమేక్ ని సెట్స్ పై పెట్టాలి అని చూస్తున్నారట, ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు.

చిరంజీవి మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్లో యాక్ట్ చేయడానికి సిద్దం అవుతున్నారు అని ఇప్పటి వరకూ వార్తలు వినిపించాయి, అయితే తాజాగా వేదాలం సెట్స్ పై పెట్టాలి అని చూస్తున్నారట.. మెగా అభిమానులకి గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఈ నెల 18న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి రెండు నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.

మెహర్ రమేష్ చిరంజీవితో తెరకెక్కించే ఈ చిత్రాన్ని చిరంజీవి, కొణిదెల ప్రొడక్షన్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంయుక్తంగా తెరకెక్కించనున్నారు, ఇప్పటికే గతంలో చిరంజీవి ఈ సినిమా కోసం గుండుతో దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు.. ట్రయల్ ఫోటో షూట్ కూడా జరిగింది. ఇక ఈ నెలలో ఆచార్యకి సంబంధించి పెండింగ్ షూటింగ్ పూర్తి చేయనున్నారు చిరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here