చిరుకు తప్పిన ప్రమాదం..

చిరుకు తప్పిన ప్రమాదం..

0

చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. చిరు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని గమనించిన ఫైలట్ అప్రమత్తమై విమానాన్ని వెనుకకి మళ్ళించాడు. దింతో చిరుకి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తి గత పర్యటన నిమిత్తం ముంబై వెళ్లిన చిరు శుక్రవారం సాయంత్రం విస్తార ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు.

అయితే ముంబై నుంచి హైదరాబాద్కు బయల్దేరిన ఈ విమానం టేకప్ ఐన కొద్దీ సేపటికి సాకేంతిక లోపాలు గుర్తించారు. దీనిని పసిగట్టిన ఫైలట్ వెంటనే విమానాన్ని వెనకకు మళ్లించి ముంబై ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ లాండింగ్ చేశాడు. ఈ విమానంలో దాదాపు 120 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

ఈ ప్రమాదంలో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి వారి ప్రాణాలను కాపాడాడని ప్రయాణికులు అంటున్నారు. ప్రస్తుతం చిరు నటించిన సైరా మూవీ అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కానుంది.