చిరు నాగార్జున మల్టీస్టారర్ సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదుర్స్

chiranjeevi Nagarjuna Multistarrer Movie Fan Made Poster

0

మల్టీస్టారర్ సినిమాలు చేయాలని చాలా మంది హీరోల అభిమానులు కోరుకుంటారు. గతంలో స్టార్ హీరోలు చాలా మంది ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేశారు .ఇప్పుడు యంగ్ హీరోలు కూడా ఈ మల్టీస్టారర్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దక్షిణాదిలో మరో మెగా మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధమవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎక్కడ ఎవరు ఈ సినిమా చేస్తున్నారు అనేది చూస్తే వినిపిస్తున్న వార్తల ప్రకారం?

కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ టాలీవుడ్ లో చేయనున్నారట. ఎవరో కాదు ? మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి వెండితెరపై సందడి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ వేద సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.

బాలీవుడ్ లో ఈ రీమేక్ ను హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో చేయాలి అని చూస్తున్నార‌ట‌. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి -కింగ్ నాగార్జున పేర్లు వినిపిస్తున్నాయి. పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి నటించారు.

ఇక ఈ సినిమా తెలుగులో చేస్తే విజయ్ సేతుపతి క్యారెక్టర్లో చిరంజీవి, మాధవన్ పాత్రలో నాగార్జున నటించే అవకాశం ఉందంటూ టాక్ నడుస్తోంది. మరి తెలుగులో దర్శకుడు ఎవరో చూడాలి. ఇక ఈ వార్త రావడంతో ఫ్యాన్స్ ఆగుతారా వెంటనే చిరు, నాగ్ ల‌తో కూడిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ వదిలారు. చూడాలి దీనిపై ప్ర‌క‌ట‌న ఏమైనా వ‌స్తుందా లేదా అనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here