చిరు కొత్త సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

చిరు కొత్త సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

0

సైరా సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. 153 వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుండగా, కొరటాల తన ప్రతీ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అయితే మొట్టమొదటి సారిగా మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రానికి మార్పు చేస్తున్నాడని తెలుస్తుంది.

బహుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, అన్ని భాషల్లో పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని చిత్రం నిర్ణయం తీసుకోగా, ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాడు కొరటాల. ఇటీవలే కాలంలో బాలీవుడ్ లో అగ్నీపత్, సైరాత్ వంటి మంచి ఆల్బమ్స్ ఇచ్చిన అజయ్ – అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారట. తొందరలో వారు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టబోతున్నారు.

చిరంజీవి సినిమాను తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అధికారికంగా ధ్రువీకరించలేదు