కొరటాల శివ తర్వాత ఆ డైరెక్టర్ తో చిరు మూవీ..!!

కొరటాల శివ తర్వాత ఆ డైరెక్టర్ తో చిరు మూవీ..!!

0

సైరా సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు షెరవేగంగా జరుగుతుండగా త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది ఈ సినిమా.. ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరు చేయబోయే సినిమా పై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తుంది.. ఓ వైపు రామ్ చరణ్ మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ సినిమా ని తండ్రి తో రీమేక్ చేయడానికి చూస్తుంటే మరోవైపు త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరుపుతున్నాడట చెర్రీ..

ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందట.. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో చిరు-త్రివిక్రమ్ కాంబోలో కామెడీ ఎంటర్‌టైనర్‌ రానుండటం మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అంశమే. నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.