చిరు నెక్స్ట్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ అతనే..!

చిరు నెక్స్ట్ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ అతనే..!

0

సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా ఈ మూవీకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకోనున్నారట. అదే నిజం అయితే చిరూతో కాజల్ కి ఇది రెండవ చిత్రం అవుతుంది. అయితే ముందుగా ఈ చిత్రానికి ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారని వార్తలు రాగ అవి ఒత్తి పుకార్లు అని తేలింది..