చిరు రాకుండానే గిఫ్ట్ ఇచ్చిన మహేష్ బాబు

చిరు రాకుండానే గిఫ్ట్ ఇచ్చిన మహేష్ బాబు

0

సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా చిరు వస్తున్నారు అనేది తెలిసిందే.. ఇక ఆయన సర్ ఫ్రైజ్ అని నిన్న చిత్ర యూనిట్ చెప్పగానే , చిరు ప్రిన్స్ ఒకే ఈవెంట్ లో ఒకే వేదికపై అని ఇరువురి అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.. ఇటు మెగా మేనల్లుడు బన్నీ అల వైకుంఠపురంలో సినిమా , అలాగే సరిలేరు నీకెవ్వరు రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి.

ఈ సమయంలో చిరు ఈ వెంట్ కు రావడానికి ఒప్పుకోవడంతో చిత్ర యూనిట్ చాలా ఆనందలో ఉన్నారు.. వచ్చే ఏడాది ఈ తొలి మెగా ఈవెంట్ సినిమా ఇండస్ట్రీకి ఇదే అని అంటున్నారు అందరూ.. తాజాగా దీనిపై హీరో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.

మేం పిలవగానే ఎంతో వినమ్రంగా అంగీకరించారు. మా వేడుకల్లో పాలుపంచుకోవడానికి మీరు వస్తుండడంతో సంతోషం పట్టలేకపోతున్నాం. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది సర్ అంటూ మహేశ్ బాబు పోస్టు చేశారు. దీంతో ఈ పోస్టుని మహేష్ అభిమానులు అలాగే మెగా అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు. మొత్తానికి ముందుగానే చిరుకి కంగ్రాట్స్ గిఫ్ట్ మహేష్ ఇచ్చాడు అంటున్నారు అందరూ.