బాబు గారు మళ్ళీ అదే మాట్లాడారు…

బాబు గారు మళ్ళీ అదే మాట్లాడారు...

0

1970 లో రాజ‌కీయ నాయ‌కులు టేప్ రీ కార్డు లాగా చెప్పిందే చెబుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టు లను విసుగు తెప్పిస్తున్నారని తాజాగా అమరావతి సార్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది… అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తన ఇంటిని ముంచాలనే ఉద్దేశంతో ప్రజల ఇళ్లను ముంచారని అన్నారు…

తాజాగా వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు… ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ… కరకట్ట రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలన్నది అందరి డిమాండ్ అని ప్రభుత్వం దాన్ని పూర్తిగా మరిచిపోయినదని అయన ఆరోపించారు

అంతేకాదు వరద బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కృత్రిమంగా వచ్చిన వరదలని.. తన ఇల్లు ముంచడానికే ప్రజల ఇళ్లను ముంచారని చంద్రబాబు మండిపడ్డారు…