చుండ్రు వేధిస్తోందా వేపతో ఇలా చేయండి చుండ్రు మటుమాయం

చుండ్రు వేధిస్తోందా వేపతో ఇలా చేయండి చుండ్రు మటుమాయం

0

చాలా మందికి చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది, అయితే వారు ఎన్నో మందులు షాంపూలు వాడుతూ ఉంటారు, అయితే మన పెరటి లో ఉన్నటువంటి వేపతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి.. మీకు దీని నుంచి ఎంతో మంచి లాభం వస్తుంది అంటున్నారు, వేప చాలా రోగాలను పోగొడుతుంది, ముఖ్యంగా ఇలా చుండ్రు సమస్య ఉన్నవారు తరచూ వేప ఆకుల పేస్టు పెట్టుకున్నా చుండ్రు సమస్య తగ్గుతుంది.

చుండ్రు సమస్య, జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవ్వుట, వెంట్రుకలు చిట్లిపోవుట ఇలా ఎలాంటి సమస్య ఉన్నా వేపతో చక్కటి పరిష్కారమార్గం ఉంటుంది , ముందుగా వేపని ముద్దగా చేసి నీరుపోసి దానిని వెంట్రులక కుదుళ్ల వరకూ రాసుకోవాలి ఇలా రాయడం వల్ల ఆ కుదుళ్ల దగ్గర ఉన్న చుండ్రు పోతుంది.

ఇలా రెండు గంటలు ఉండి సాధారణంగా స్నానం చేయండి, ఇక చుండ్రు సమస్య తగ్గుతుంది.. లేత ముదురు ఏ ఆకులు తీసుకున్నా మంచిది.. ఫ్రెష్ ఆకులు తెచ్చుకోవాలి, అలాగే రెండు గంటల తర్వాత వేడి నీటితో స్నానం చేస్తే ఆవేప వల్ల చుండ్రు పోతుంది. ఇలా మూడు రోజులకి ఓసారి చేసి చూడండి సమస్య తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.

గమనిక– ఒకవేళ కురుపులు లాంటివి తలలో ఉంటే వేప పెట్టద్దు వైద్యులని సంప్రదించాలి, రాషెస్ వచ్చే ప్రమాదం ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here