భార్యాభర్తల కేసు విషయంలో సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

CI, Essay Suspension in case of spouses

0

హైదరాబాద్: చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకరరావు, అశోక్‌నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ పి. నర్సింగరావు సస్పెండ్‌ అయ్యారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. భార్యాభర్తల కేసు విషయంలో వీరిని సీపీ సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

సీసీఎస్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి. నాగరాజుగౌడ్‌ను కూడా సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత, ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐని, ఎస్‌ఐను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారిని సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం. కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో పాటు, సీసీఎస్‌కు వెళ్లాలని బాధితులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధను వెళ్ళగక్కడంతో పాటు నిందితులను కాపాడేందుకు ‘మీ డిపార్ట్‌మెంట్‌ వారే సహకరిస్తున్నారు’ అని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

సీపీ ఈ కేసుపై అంతర్గత విచారణ జరిపినట్లు సమాచారం. విచారణలో బాధితుల ఫిర్యాదు నిజమేనని తేలడంతో ముగ్గురినీ సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here