సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి..

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి..

0

420 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయికి వెళ్లిపోయారని వైసీపీ నాయకులు ఉద్దేశించి టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… దాడులు చేసే వారి పై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు…

జైల్లో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అలాగే ఎంపీ విజయసాయిరెడ్డిని చూస్తుంటే అర్ధం అవుతుందని ఆరోపించారు బుద్దా వెంకన్న…

కోర్టులు, న్యాయవాదులు, జడ్జిల పై దాడికి పాల్పడే విధంగా నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదంగా వ్యవహరిస్తున్న11 కేసుల్లో ఏ 1 గా ఉన్న జగన్, ఏ2 విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చెయ్యాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు…