సీఎం జగన్ కు దేశం మొత్తం ఫిదా

సీఎం జగన్ కు దేశం మొత్తం ఫిదా

0

శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు… ఈమేరకు ట్వీట్ కూడా చేశారు.. కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో దిక్కుతోచడం లేదాయనకు అని ట్వీట్ చేశారు. వాటినీ దాస్తున్నారని బురద కుమ్మరించడానికీ సిగ్గుపడడు. 2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఆంధ్రానే. ఇలాంటివి కనిపించవు.

కరోనా వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాదు. కొంత కాలం దాంతో కలిసుండాల్సిందే అన్నందుకు సిఎం జగన్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశాడు. ఎల్లో మీడియా ‘జయము జయము చంద్రన్న’ భజన అందుకుంది. ప్రపంచమంతా అంటున్నదే సిఎం చెప్పారు. ఏదైనా మంత్ర దండం ఉంటే దేశాన్ని కాపాడొచ్చు గదా బాబూ అని అన్నారు..

బగ్గుమనే ఎండలో వందల కి.మీ నడిచి వెళ్తున్న వలస కార్మికుల దయనీయ దృశ్యాలు చూస్తున్నాం. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలన్నీ నిస్సహాయంగా ఉండిపోయాయి. 2 వేల కి.మీ దూరాన గుజరాత్ లో చిక్కుబడిన 5 వేల మంది మత్స్యకారులను తీసుకొచ్చేందుకు సిఎం జగన్ చూపిన చొరవను దేశమంతా ప్రశంసిస్తోంది.