సీఎం జగన్ కు పరిటాల ఫ్యామిలీ ఓపేన్ ఛాలెంజ్

సీఎం జగన్ కు పరిటాల ఫ్యామిలీ ఓపేన్ ఛాలెంజ్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పరిటాల ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్ విసిరింది… అమరావతిలో తమపేరిట భూములు ఉన్నాయని నిరూపిస్తే అది ప్రభుత్వానికే ఇచ్చేస్తామని పరిటాల శ్రీరామ్ అన్నారు…

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో పరిటాల ఫ్యామిలీ కూడా అమరావతిలో భూములు కొన్నారని ప్రజెంటేషన్ ద్వారా వైసీపీ నాయకులు చూపించారు… దీనిపై శ్రీరామ్ స్పందించారు… తమపేరు మీద అమరావతిలో సెంటు భూమి కూడా లేదని అన్నారు…

ఒకవేళ ఉంటే అది వైసీపీ నాయకులు నిరూపిస్తే దాన్ని ప్రభుత్వానికే రాసిస్తామని అన్నారు… ఈ మేరకు శ్రీరామ్ ట్వీట్ కూడా చేశారు…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్..!!

మా పరిటాల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తాం..
మీ ప్రభుత్వానికి నిరూపించే దమ్ముంటే సవాలును స్వీకరించి ఆధారాలు చూపించండి..!!
@ysjagan