సీఎం జగన్ ఫోటోను మంటల్లో వేసిన చంద్రబాబు… క్లారిటీ ఇచ్చిన వైసీపీ

సీఎం జగన్ ఫోటోను మంటల్లో వేసిన చంద్రబాబు... క్లారిటీ ఇచ్చిన వైసీపీ

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ అలాగే బోస్టన్ కమిటీ నివేదికను దానితోపాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోను కూడా భోగి మంటల్లో వేసి కాలచిన సంగతి తెలిసిందే…

అయితే దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో తప్పబడుతున్నారు… కమిటీ నివేదికలను అలాగే జగన్ ఫోటోలను మంటల్లో వేయడం దుర్మార్గం అని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

టీడీపీ హాయంలో చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటన రాకముందే తన బినామీలతో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు… అధికార వికేంద్రీకరణ రాష్ట్ర ప్రజలు మొత్తం స్వాగతిస్తున్నారని కానీ టీడీపీ నాయకులు వారి బినామీలు మాత్రం స్వాగతించకున్నారని ఆమంచి ఆరోపించారు..