సీఎం సారూ..ప్లీజ్ సేవ్ ఏపీ పోలీస్..ఏఆర్ కానిస్టేబుల్ నిరసన

0

ఏపీలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నిరసన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ అనంతపురంకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ మంగళవారం ఫ్లకార్డు చేతబట్టి నిరసన వ్యక్తం చేశాడు.

ఏపీ పోలీస్ ను కాపాడాలంటూ పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ‘ఏపీ సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌, గ్రాంట్‌ ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ అరియర్స్‌.. సామాజిక న్యాయం ప్లీజ్‌’ అంటూ నిరసన తెలిపాడు. తమకు మూడు సరెండర్‌ లీవ్స్‌, అదనపు సరెండర్‌ లీవ్స్‌కు సంబంధించిన మొత్తం రాలేదని ప్రకాష్​ ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీసులకు 14 నెలలకు సంబంధించి రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించినట్లు ఆడిట్‌లో చూయించి.. వాటిపై పన్ను వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here