కాపీ కొట్టిన ‘ఎవరు’ ?

కాపీ కొట్టిన 'ఎవరు' ?

0

వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా కసండ్ర హీరోయిన్‌ గా రూపొందుతోన్న థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. అయితే ఈ చిత్రం ‘ది ఇన్ విజిబుల్ గెస్ట్ ‘ అనే స్పానిష్ చిత్రం ప్రేరణతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా స్పానిష్ చిత్రానికి కాపీనే అని తెలుస్తోంది. పైగా ఇదే స్పానిష్ చిత్రం ఆధారంగా బాలీవుడ్ లో ‘బద్ లా’ అనే చిత్రం వచ్చింది.

ఇక ఎవరు సినిమా విడుదల తేదిని ఆగష్టు 23న నుంచి వారం రోజుల ముందుకు మార్చి.. సినిమాను ఆగష్టు 15నే రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తుండగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీవీపీ అండ్ అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో క్షణం అనే హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.