ఇండియాలో కరోనా తగ్గుముఖం..కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

Corona decline in India .. 3.06 lakh new cases registered

0

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతుంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి పోయాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,49,335కు చేరింది. ఇక ఇండియాలో రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉండగా.. వారం రోజుల పాజిటివిటీ 17.03 శాతంగా ఉంది.

ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 439 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4.89 లక్షలకు చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 3.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.66 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

మొత్తం కేసులు: 3,95,43,328

మొత్తం మరణాలు: 4,89,848

యాక్టివ్ కేసులు: 22,49,335

మొత్తం కోలుకున్నవారు: 3,68,04,145

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here