కరోనా ఎఫెక్ట్ – ఐపీఎల్ ఆగిపోయింది – మళ్లీ ఎప్పుడు ?

కరోనా ఎఫెక్ట్ - ఐపీఎల్ ఆగిపోయింది - మళ్లీ ఎప్పుడు ?

0

ఈ కరోనా సమయంలో కాస్త క్రీడా అభిమానులు అందరూ ఇంటి పట్టున ఉండి ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్నారు… అయితే ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచులు చూస్తున్నారు… అయితే క్రీడాకారులు కొందరికి కరోనా రావడంతో ఇక ఐపీఎల్ ఆగిపోయింది.

 

 

ఐపీఎల్ జట్లలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడుతుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ కు ఐపీఎల్ ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు…ఉదయం నుంచి ఈ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

 

అయితే ఇది కేవలం తాత్కాలికం అని మరికొద్ది రోజుల్లో విరామం తర్వాత మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి….తాజా సీజన్ లో 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన మ్యాచ్ లన్నింటినీ ముంబయిలోనే జరపాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో….ప్రస్తుతం అన్నీ టీమ్స్ ఆటగాళ్లు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here