కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ బిగ్ డెసిషన్…

కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ బిగ్ డెసిషన్...

0

తెలంగాణలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది… దీన్ని అరికట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఇక నుంచి హోం క్వారంటైన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది… కోవిడ్ 19 ఇంక్యుబేషన్ పిరియడ్ 14 రోజులు కావడంతో ఇప్పటివరకు రెండు వారాలు హోం క్వారంటైన్ విధించింది….

అయితే కొన్ని కేసుల్లో 14 రోజులు తర్వాత పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి… ఈ నేపథ్యంలో ప్రభుత్వం హోం క్వారంటైన్ కాలాన్ని 28 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది… దీంతో పాటు వైరస్ బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తికి మాత్రమే పరీక్షలు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది…

సెకండరీ కాంటాక్ట్ టెస్ట్ ను చెయెద్దని వారిని హోం క్వారంటైన్ లో ఉంచితే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది… కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలు హోం క్వారంటైన్ కాలాన్ని 28 రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే…