క‌రోనా స‌మయంలో ఇంటిలోకి వెళ్లి క‌త్తితో దాడి ? కార‌ణం తెలిసి అరెస్ట్ చేసిన పోలీసులు

క‌రోనా స‌మయంలో ఇంటిలోకి వెళ్లి క‌త్తితో దాడి ? కార‌ణం తెలిసి అరెస్ట్ చేసిన పోలీసులు

0

కొంద‌రు తిన్న‌ది అర‌క్క కొన్ని ప‌నులు చేస్తూ ఉంటారు.. ఓ ప‌క్క క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంటే కొంద‌రు చిల్ల‌ర ప‌నులు చిల్లర చేష్ట‌లు చేస్తూనే ఉంటున్నారు..తాజాగా ఈ క‌రోనా స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. లాక్ డౌన్ వేళ ఇంటికి ప‌రిమితం అయ్యారు.

కాని కొంద‌రు పేకాట రాయుళ్లు మాత్రం తోట‌ల్లో పొలాల్లో ఊరు చివ‌రన పోలీసులు రారు క‌దా అని పేకాట ఆడుతున్నారు, ఈ స‌మ‌యంలో వీరేశం అనే వ్య‌క్తి పేకాట‌లో ఓడిపోయాడు. దాదాపు 5 వేల వ‌ర‌కూ ఆట‌లో పొగొట్టుకున్నాడు.

అయితే త‌ర్వాత రోజు కూడా మ‌రో 2 వేలు ఓడిపోయాడు, కాని అత‌ను డ‌బ్బు తిరిగి ఇవ్వ‌ను అని మ‌ల్లేషంతో అన్నాడు, దీంతో ఆట గెలిచిన మ‌ల్లేషం కోపంతో వీరేశం ఇంటిలోకి వెళ్లి మ‌రి అత‌ని చేతిని క‌త్తితో న‌రికాడు, కార‌ణం అడిగితే జూదంలో ఓడి డ‌బ్బు ఇవ్వ‌ను అన్నాడు అని అందుకే దాడి చేశాను అని చెప్పాడు.

వెంట‌నే మ‌ల్లేషం కొడుకు క‌త్తి తీసుకుని వీరేశాన్ని చిత‌క్కొట్టి పోలీసుల‌కి స‌మాచారం ఇచ్చాడు, ప్ర‌స్తుతం క‌త్తి గాయంతో వీరేషం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు, మొత్తం 7 గురిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.