ఏపీలో కరోనా టెన్షన్..కొత్తగా 12,926 కేసులు..ఆ రెండు జిల్లాల్లో వైరస్ టెర్రర్

Corona tension in AP .. 12,926 new cases .. Virus terror in those two districts

0

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది.  తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,926  కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,661,94 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ విహెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో ఏడుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14538కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3,913 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి దాకా 3, 20, 56, 618 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేటి వరకు రాష్ట్రంలో 3,21,00,381 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా కొత్తగా విశాఖ జిల్లాలో ప్రమాదకరంగా 1959 కొత్త కేసులు వెలుగుచూశాయి. చిత్తూరులో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  1379

చిత్తూరు         1566

ఈస్ట్ గోదావరి   756

గుంటూరు  1212

వైస్సార్ కడప  734

కృష్ణ   354

కర్నూల్  969

నెల్లూరు   875

ప్రకాశం    1001

శ్రీకాకుళం 868

విశాఖపట్నం  1959

విజయవాడ   562

వెస్ట్ గోదావరి   691

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here