క‌రోనాతో స్వాధినం చేసుకున్న బైక్ ల‌ని పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా

క‌రోనాతో స్వాధినం చేసుకున్న బైక్ ల‌ని పోలీసులు ఏం చేస్తున్నారో తెలుసా

0

దేశ వ్యాప్తంగా పోలీసులు లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో రోడ్ల‌పైకి వ‌చ్చి ఇష్టం వ‌చ్చిన రీతిన లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు, అంతేకాదు కొన్ని స్టేట్స్ లో ఆ బైక్స్ కార్ల‌కి భారీగా ఫైన్లు వేస్తున్నారు.

ఇక తాజాగా కొన్ని పోలీస్ స్టేష‌న్లో ఇలా బైక్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి మాట విన‌ని వారిని అన‌వ‌స‌రంగా వ‌చ్చే వారి బైక్ లు కార్లు తీసుకుంటున్నారు, వీటికి భారీగా ఫైన్లు ప‌డ‌తాయి, కోర్టుకు వచ్చి వైర‌స్ త‌గ్గిన త‌ర్వాత న‌గ‌దు క‌ట్టి బైక్ తీసుకువెళ్లాలి అని చెబుతున్నారు, అంతేకాదు వాటిపై రెడ్ జోన్ లో ప‌ట్టుబ‌డితే స్టిక్క‌ర్ వేస్తున్నారు.

ఎప్పుడు సీజ్ చేశామో రాస్తున్నారు, దానిని డేటాలో చేర్చి ఆ బైక్ ఎప్పుడు ప‌ట్టుబ‌డిందో రాసి దానికి ఎంత ఫైన్ అనేది పైన రాస్తున్నారు, వీటిని అన్నింటిని ద‌ర్గ‌ర్లో కాలేజీల‌కు స్కూళ్ల పార్కింగ్ ప్లేస్ లో పెడుతున్నారు, అక్క‌డ సెక్యూరిటీ పెడుతున్నారు, ఈ బైక్స్ అంత తేలిగ్గా ఇవ్వ‌మ‌ని ద‌య‌చేసి బైక్స్ పై అన‌వ‌స‌రంగా తిర‌గ‌ద్దు అంటున్నారు, భారీ ఫైన్లు క‌ట్టాల్సిందే అంటున్నారు…అయితే పోలీసులు చేసే ప‌ని మంచిది అని చాలా మంది అంటున్నారు. ఎందుకు రావ‌డం భారీగా ఫైన్లు క‌ట్ట‌డం ఇంట్లోనే ఉండండి.