క‌రోనా వేళ దారుణం వ్య‌క్తిపై కోపంతో ఇంటి ప‌క్క‌న వ్య‌క్తి ఏం చేశాడంటే

క‌రోనా వేళ దారుణం వ్య‌క్తిపై కోపంతో ఇంటి ప‌క్క‌న వ్య‌క్తి ఏం చేశాడంటే

0

ఇలాంటి వ్య‌క్తులు కూడా ఉంటారా అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. రామ్ లాల్ అనే వ్య‌క్తి బంగారం వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు, అయితే అత‌ని ఇంట్లో జూలీ ఉంది, జూలీ అంటే అతని కుక్క పిల్ల‌, అయితే రామ్ లాల్ త‌న‌కు ఉన్న కోట్ల ఆస్తితో బాగానే బ‌తుకుతున్నాడు, ఈ స‌మ‌యంలో క‌రోనాతో పేద‌ల‌కు సాయం చేస్తూ త‌న ఇంటి ద‌గ్గ‌ర ఆహ‌రం వండించి అవి కారులో తీసుకువెళ్లి వారి పిల్ల‌లు షాపులో ప‌నిచేసే వారు పంచుతున్నారు.

ఇది చూసి త‌ట్టుకోలే‌ని మ‌ద‌న్ అనే మ‌రో వ్యాపారి అత‌నికి పేరు వ‌స్తుంది అని చాలా మ‌ద‌న‌ప‌డ్డాడు, తెల్ల‌వారుజామున అత‌ని ఇంటి గేటు ద‌గ్గ‌ర ఉన్న జూలి కుక్క‌కి విషం క‌లిపిన బిస్కెట్స్ పెట్టాడు, అది తిని గంట‌కి మ‌ర‌ణించింది.

అయితే ఇలా ఇంట్లో కుక్క మ‌ర‌ణించ‌డంతో సీసీ కెమెరా చూస్తే మ‌ద‌న్ పెట్టిన ఫుడ్ తిన‌డం క‌నిపించింది, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు, అత‌నిని విచారిస్తే అస‌లు విష‌యం చెప్పాడు, దీంతో అత‌నిపై జంతుప్రేమికులు మండిప‌డుతున్నారు, అత‌నిని వ‌దిలిపెట్టేది లేదు అని కేసులు ఫైల్ చేశారు, ఇలాంటి వారు కూడా ఉంటారా అని బాధ‌ప‌డుతున్నారు జంతుప్రేమికులు.