జగన్ కు బిగ్ షాక్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై

జగన్ కు బిగ్ షాక్దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు… ఆ పార్టీకి చెందిన సీనియర్ రాజకీయనేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే కాలంలో వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నేతలకు నచ్చలేదట. అందుకే ఉంటే వైసీపీలో ఉండాలని లేదంటే బీజేపీలో చేరాలని దగ్గుబాటి ఫ్యామిలీకి అల్టిమేటమ్ జారీ చేశారట.

దీంతో దగ్గుబాటి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారట… ఎలాగో తన భార్య వైసీపీలో చేరదు… తానే బీజేపీలో చేరితే బాగుంటుందని భావిస్తున్నారట. పైగా కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది కనుక తనకు మంచిహోదా లభిస్తుందని భావిస్తున్నారట…