జగన్ కు బిగ్ షాక్ ఇస్తూ రూట్ మార్చిన దగ్గుబాటి ఫ్యామిలీ

జగన్ కు బిగ్ షాక్ ఇస్తూ రూట్ మార్చిన దగ్గుబాటి ఫ్యామిలీ

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గుబాటి ఫ్యామిలీ త్వరలో బిగ్ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… గత ఎన్నికల్లో వైసీపీ తరపున పర్చూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వెంకటేశ్వరరావు ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే జగన్ మోహన్ రెడ్డి షరుతల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం… నిన్న పురందేశ్వరి కూడా అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు… కుటుంబంతో సుదీర్ఘ చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది….

ఇక కుమారుడు హితేష్ చెంచురాం కూడా తన రాజకీయ భవిష్యత్ గురించి ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని చెప్పారట… ఇక ఈ పరిస్థితులను పరిశీలించిన తర్వాత దగ్గుబాటి పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట…