దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీని వీడుతుందా

దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీని వీడుతుందా

0

తెలుగుదేశం పార్టీ తరపున కీలక నాయకులు అందరూ వైసీపీ వైపు చూస్తున్నారు.. ఈ సమయంలో వైసీపీలో ఉన్న దగ్గుబాటి కుటుంబం కూడా టీడీపీలోకి వెళ్లాలి అని భావిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పురందరేశ్వరి బిజెపిలో ఉన్నారు. వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారు… ఇటీవల వెంకటేశ్వరరావుకి జగన్ భార్యా భర్తలు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని స్పష్టంగా చెప్పారని వార్తలు వచ్చాయి.

అయితే ఆమె మాత్రం వైసీపీలోకి వచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. అందుకే రావి రామనాదం బాబుని మళ్ళీ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో కావాలనే పర్చూరులో దగ్గుబాటికి రాజకీయంగా ఇలా పొగ బెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దగ్గుబాటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

కాని ఇందులో వాస్తవం ఎంత వరకూ ఉంది అంటే ఇది కేవలం కొన్ని మీడియాలు చేస్తున్న ఉత్తి మాటలని ఆయన వైసీపీ వదిలి వెళ్లే ఛాన్స్ లేదు అంటున్నారు. వైసీపీ నేతలు, అసలు టీడీపీలోకి ఆయన వెళ్లే ఆస్కారం లేదు అని చెబుతున్నారు పర్చూరు నేతలు.