దారుణం మహిళపై మరో మహిళ బ్లేడుతో దాడి

దారుణం మహిళపై మరో మహిళ బ్లేడుతో దాడి

0

తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… మహేశ్వరి అనే వివాహేతరపై రష్మీ అనే యువతి హత్యాయత్నం చేసి పారార్ అయింది… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేశ్వరి భర్తతో రష్మీ గతంలో ప్రేమాయణం జరిపింది…

కానీ ఆతడు రష్మీని వివాహం చేసుకోకుండా మహేశ్వరిని వివాహం చేసుకున్నాడు.. దీంతో మహేశ్వరిపై రష్మీ కక్ష పెట్టుకుంది… మహేశ్వరి వల్లే తనకు తన ప్రియుడితో వివాహం జరుగలేదనే ఉద్దేశంతో ఎవ్వరు లేని సమయంలో రష్మీ మహేశ్వరిపై బ్లేడుతో దాడి చేసింది…

ప్రస్తుతం మహేశ్వరి గొంతుకు తీవ్ర గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు… మహేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది… పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న రష్మీని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు…