జూలై 11న డియర్ కామ్రేడ్` ట్రైలర్

జూలై 11న డియర్ కామ్రేడ్` ట్రైలర్

0

విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నా ఇదొక హిట్ పెయిర్ అనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ నటించిన గీతగోవిందం సూపర్‌డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ ఈ హిట్ పెయిర్ `డియర్ కామ్రేడ్‌`లో జతకట్టారు. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్‌` ట్యాగ్ లైన్‌`. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 11న విడుదల చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

జస్టిన్ ప్రభాకర్ సంగీత సారథ్యంలో ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ఫెంటాస్టిక్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న విడుదలవుతుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ బ్యానర్స్‌: మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సి.ఇ.ఒ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: వై.అనీల్‌, మ్యూజిక్‌: జస్టిన్ ప్రభాకరన్‌ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, ఎడిటింగ్ & డి.ఐ: శ్రీజిత్ సారంగ్‌, డైలాగ్స్‌: జె కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్‌: రామాంజనేయులు, సాహిత్యం: చైతన్య ప్రసాద్‌, రహమాన్‌, కృష్ణకాంత్‌, కొరియోగ్రాఫర్‌: దినేష్ మాస్టర్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌: అశ్వంత్ బైరి, రజని, యాక్షన్ డైరెక్టర్‌: జి.మురళి, పబ్లిసిటీ డిజైన్‌: అనీల్, భాను, పి.ఆర్‌.ఒ: వంశీ శేఖర్‌.