డిసెంబర్ లో వేగం పెంచనున్న కొరటాల‍‍ చిరు

డిసెంబర్ లో వేగం పెంచనున్న కొరటాల‍‍ చిరు

0

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత కచ్చితంగా అంతే సక్సెస్ లో ఉన్న దర్శకుడు ఎవరు అంటే కచ్చితంగా కొరటాల శివ అనే చెబుతారు, అన్నీ సక్సస్ అయ్యాయి ఆయన చిత్రాలు, అయితే ఆయన తాజాగా మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు.

భరత్‌ అనే నేను తర్వాత ఒక ఠాగూర్‌ లాంటి సినిమా చేద్దామంటూ చిరంజీవిని అప్రోచ్‌ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్‌లో సినిమా మొదలు పెడతారంటూ అనుకున్నారు కాని జరగలేదు, అయితే డిసెంబరులో ఈ చిత్రం స్టార్ అవనుంది అని తెలుస్తోంది.

దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది, ఇప్పటికే స్టోరీ మార్పులు చేర్పులు , క్రూ ఎవరు, ఏ పాత్ర అనేది కొరటాల మొత్తం సెట్ చేసుకున్నారట. అయితే ఈ సినిమా ఆరు నెలల్లో పూర్తి చేస్తారట వచ్చే ఏడాది ఆగష్టుకి రిలీజ్ ఉంటుంది అని తెలుస్తోంది. డిసెంబర్ నుంచి వేగంగా షూటింగ్ చేయనున్నారట.