డాక్ట‌ర్ ని ఇళ్లు ఖాళీచేయ‌మ‌న్న ఓన‌ర్ అరగంట‌లో సీన్ మారింది

డాక్ట‌ర్ ని ఇళ్లు ఖాళీచేయ‌మ‌న్న ఓన‌ర్ అరగంట‌లో సీన్ మారింది

0

ఓప‌క్క డాక్ట‌ర్లు దేవుళ్ల‌లా మారి మ‌న ప్రాణాలు ర‌క్షిస్తున్నారు, వైరస్ తో బాధ‌ప‌డే వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ స‌మ‌యంలో వారికి మ‌నం ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి…. కాని కొంద‌రు మాత్రం అతి దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు… కొంద‌రు ఇంటి య‌జ‌మానులు ఏకంగా ఇళ్లు ఖాళీ చేయాల‌ని వారిని వేధిస్తున్నారు….దీంతో స‌ర్కార్ సీరియ‌స్ అయింది, ఇలా ఎవ‌రైనా వేధిస్తే క‌చ్చితంగా పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు అని తెలిపింది.

తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్విగ్ధా అనే వైద్యురాలిని ఇల్లు ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమె ఊరుకోలేదు వెంట‌నే పోలీ‌సుల‌కు మంత్రికి ఈ విష‌యం తెలిపారు.

అర‌గంట‌లో వారు అక్క‌డ‌కు చేరుకున్నారు, ఆ ఇంటి య‌జ‌మాని మాట‌లు విన్నారు. ఏకంగా డాక్ట‌ర్ ని ఖాళీ చేయాల‌ని ఆ డాక్టర్ సామాన్లు గాంధీ ఆస్ప‌త్రిలో పెట్టుకోవాలి అని విమ‌ర్శ‌లు చేశాడు, అత‌నిని వ‌దిలేది లేదు అని తెలిపారు అధికారులు.