అరుదైన రికార్డు సాధించిన దీపక్‌

అరుదైన రికార్డు సాధించిన దీపక్‌

0

భారత యువ స్పీడ్‌స్టర్ దీపక్ చాహర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తన అద్భత స్వింగ్ బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను బెంబేలెత్తిచ్చిన దీపక్ చాహర్ కొత్త రికార్డు సృష్టించాడు. విండీస్‌తో జరిగిన చివరి టి20లో దీపక్ మూడు వికెట్లు పడగొట్టాడు. మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి విండీస్ ఇన్నింగ్స్‌ను శాసించాడు.

ఈ మ్యాచ్‌లో అతడు రికార్డును సాధించాడు. టి20లలో వెస్టిండీస్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా అత్యుత్తమ ఎకానమీ ఇచ్చిన రెండో ఆటగాడిగా దీపక్ (1.23) నిలిచాడు. భువనేశ్వర్ (1.00) తొలి స్థానంలో ఉన్నాడు. కొత్త బంతిని అందుకున్న దీపక్ వెస్టిండీస్‌పై నిప్పులు చెరిగే బంతులతో విండీస్ టాప్ ఆర్డర్ హడలెత్తించాడు.