ఆ హీరో తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!

ఆ హీరో తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!

0

దీపికా పడుకునే దేశంలోనే టాప్ హీరోయిన్.. బాలీవుడ్ లో అగ్రతారగా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ఏమీ ఉండదని చెబుతుంది… తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయం వెల్లడించింది.

‘ప్రేమలో పడ్డ వెంటనే సహజీవనం చేయాలనుకోవడం నాకు నచ్చలేదు. ఇష్టపడిన వ్యక్తి గురించి పెళ్లికి ముందే తెలుసుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. మాకు ఆ పద్ధతి నచ్చలేదు. అందుకే మేం సహజీవనం చేయలేదు. మేం సరైన నిర్ణయమే తీసుకున్నామని అనుకుంటున్నా. ఇప్పుడు భార్యభర్తలుగా ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తున్నాం. మాకు వివాహ వ్యవస్థపై చాలా నమ్మకముంద’ని దీపిక వ్యాఖ్యానించింది.