దిషా కేసులో నిందితులని పట్టించిన క్లూ ఇదే

దిషా కేసులో నిందితులని పట్టించిన క్లూ ఇదే

0

దిషాని అత్యంత దారుణంగా చంపిన ఈ దుర్మార్గులు చేసిన కొన్ని తప్పులు పోలీసులకు ఈజీగా క్లూ అయ్యాయి, అయితే ఆమెని మద్యం మత్తులో ఇంత దారుణంగా చంపాము అని నిందితులు తమ తప్పు ఒప్పుకున్నారు. బైక్ అక్కడే పెట్టింది కాబట్టి రాత్రి ఏ సమయానికైనా సరే తిరిగి వస్తుంది… కాబట్టి అక్కడే వేచి ఉండాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే అక్కడే కూర్చుకున్నారు. అమ్మాయి రాత్రి 9:20 వచ్చింది.

ఆమెపై అత్యాచారం చేయాలి అని అనుకున్న వారు ఆమెని నోరు కుక్కి లోపలకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు.
ఆమె బైక్ ను రిపేర్ చేయిస్తామని చెప్పి తీసుకెళ్లారు.. అదే సమయంలో మహ్మద్ ఆరిఫ్ ఫోన్ నెంబర్ ను తీసుకుంది. ఆరిఫ్ మొబైల్ నుంచి ఆమెకు ఫోన్ చేశారు. బైక్ గురించి అడిగింది దీంతో ఇదే పోలీసులకు క్లూ అయింది.

చివరగా చెల్లికి ఫోన్ చేసిన తర్వాత ఆమె ఫోన్ అతనికి మాత్రమే చేసింది. దీంతో ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ అవ్వడంతో అతని దగ్గరే ఏదో జరిగింది అని పోలీసులకు తెలిసింది. అలా కూపీ లాగితే మొత్తం కేసు చివరకు తేలింది.. నిజంగా ఆమె ఫోన్ చేసి ఉండకపోతే వారు దొరకడానికి చాలా కష్టం అని చెబుతున్నారు పోలీసులు.