దిషా సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు

దిషా సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు

0

దిశపై క్రూర మృగాలు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు
ఈరోజు తెల్లవారు జామున సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ఈ సమయంలో ఆమె సెల్ ఫోన్ కు సంబంధించి కీలక విషయాలని తెలియచేశారు నలుగురు నిందితులు, దిశ సంఘటన తర్వాత ఆమె ఫోన్ కాలే ఇలా నిందితులని పట్టించింది.. కాని ఆ నిందితులు మాత్రం ఆమె ఫోన్ ని ఎక్కడ పెట్టామో చెప్పలేదు. తాజాగా ఆమె ఫోన్ కాల్ విషయం బయటపడింది.

దిశ సెల్ఫోన్ను నిందితులు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ పాతిపెట్టిన ఘటనాస్థలాన్ని నిందితులు నలుగురు ఉదయం పోలీసులకు చెప్పారట. ఈ దారుణమైన ఘటన జరిగిన అర కిలో మీటర్ పరిధిలో దిశ మొబైల్, వస్తువులను పాతిపెట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది.

ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు స్విచ్చాఫ్ చేశారు అలాగే అందులో డేటా ఏమైనా డిలీట్ చేశారా, వీడియో రూపంలో ఫోటోల రూపంలో ఏమైనా క్లూ ఉందా, అనేది కూడా ఈఫోన్ పరిశీలిస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు ..అంతేకాదు దిశ హత్య కేసులో వాడిన లారీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లారీలో ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.