దిల్లీకి దిశ నిందితుల మృతదేహాలు ఎందుకో తెలుసా

దిల్లీకి దిశ నిందితుల మృతదేహాలు ఎందుకో తెలుసా

0

దిశ అత్యాచార ఘటనలో నిందితులని పోలీసులు కాల్చి చంపేశారు. కాని ఇదే పోలీసుల మెడకు చిక్కుకున్న కేసుగా మారింది. దీంతో పోలీసులు కూడా సుప్రీం ముందు విచారణకు వెళ్లారు, ఈ కేసు సుప్రీంలో విచారణ కారణంగా ఇంకా తేలాల్సి ఉంది..అయితే అంత్యక్రియలు జరుపకుండా ఆ నలుగురు బాడీలు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాయి.
తాజాగా ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని తెలుస్తోంది.

ఈ దారుణానికి కారణం అయిన నలుగురు బాడీలు దిల్లీకి తీసుకువెళ్లాలి అని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఇక్కడ వారి బాడీలు భద్రపరచడం పెను భారంగా మారుతోంది. ఇప్పటికీ ఫ్రీజర్ లో ఉన్నా అవి కుళ్లి పోయే స్దితికి వచ్చాయట.

ఎంబామింగ్ చేసినా కేవలం రెండు లేదా మూడు వారాల పాటు భద్రపరచవచ్చని అధికారులు చెబుతున్నారు.
గాంధీ ఆస్పత్రిలో వీటిని భద్రపరిచేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో, వీటిని ఢిల్లీలోని అధునాతన మార్చురీకి తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు . మరి ఇది నిజమా కాదా అనేది చూడాలి.