పోలవరం పవర్ ప్రాజెక్ట్ కోసం జగన్ బేరసారాలు

పోలవరం పవర్ ప్రాజెక్ట్ కోసం జగన్ బేరసారాలు : దేవినేని

0

పోలవరం పవర్ ప్రాజెక్ట్ కోసం జగన్ బేరసారాలు చేశారని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న రీతిలో జగన్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైఎస్ హెలికాప్టర్ కనిపించని సమయంలోనే బేరసారాలు జరిగాయన్నారు. జగన్ బంధువు పీటర్ తప్పుడు నివేదికలతో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మేధావులు, నిపుణుల నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పీటర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ విధానాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పుపట్టిందన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల ఒక మండలం మునిగిందని మంత్రి అనడం తగదన్నారు.