దీపావళి వేళ చైనాకి భారీ నష్టం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

దీపావళి వేళ చైనాకి భారీ నష్టం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

0

మన దేశంలో దీపావళి చాలా ఘనంగా చేసుకుంటారు, ముఖ్యంగా వేల కోట్ల రూపాయల మార్కెట్ జరుగుతుంది, బట్టలు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, బంగారం, ఇంటి వస్తువులు ఇలా అనేక వస్తువులు ఈ సమయంలో కొంటారు. అయితే ఈ సమయంలో ఇతర దేశాల నుంచి కొన్ని గూడ్స్ కూడా మన దేశంలోకి వస్తాయి, అయితే ఈసారి చైనా నుంచి భారీగా దిగుమతులు తగ్గిపోయాయి, చాలా వరకూ మన దేశీయ ప్రొడక్ట్స్ నే కొన్నారు అందరూ.

ఈ దీపావళి పండుగ సందర్భంగా రూ. 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగాయని, అమ్మకాలు 10.8 శాతానికి పెరిగాయని, వ్యాపారులు చెబుతున్నారు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్లు, బంగారం, వాల్హ్యాంగింగ్స్, ఆభరణాలు, వంట సామగ్రి, ఫర్నిచర్, ఫుట్వేర్, ఇంటి అలంకరణ సామగ్రి, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్, గిఫ్ట్ ఐటెమ్స్, స్వీట్లు మన దేశంలో భారీగా అమ్మకాలు జరిగాయి.

ఈసారి చైనా ఉత్పత్తులకు భారీ నష్టం జరిగినట్లు ట్రేడర్స్ సంఘం వెల్లడించింది. దాదాపు ఇందులో 40 వేల కోట్ల రూపాయల వస్తువులు మన వారు వాస్తవానికి చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి, కాని ఏమీ చైనా నుంచి దిగుమతి కాలేదు.. చైనా- భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. చైనా ఉత్పత్తులను వ్యాపారులు కూడా కొనుగోలు చేయలేదు, ఇక హోల్ సేల్ కొనుగోళ్లు లేకపోవడంతో రిటైల్ మార్కెట్ కూడా అలాగే ఉంది.. దీని మూలంగా దసరా దీపావళికి చైనాకు మాత్రం 40 వేల కోట్ల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు వ్యాపారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here