నాగార్జున సినిమాలో కృతి శెట్టిని ఫైనల్ చేశారా ? టాలీవుడ్ టాక్

Did Kriti Shetty finalize the movie Nagarjuna?

0

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం రానున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉంది, నాగార్జున కూడా సిద్దం అయ్యారు. కాని కొన్ని కారణాల వల్ల బ్రేకులు పడుతూ వచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఈ సినిమాకి ముహూర్తం కుదిరిందట. నాగార్జున కథానాయకుడిగా బంగార్రాజు చిత్రం ఆగస్టు 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలనే ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇక మేకర్స్ దీనికి సంబంధించి ప‌నిలో ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు పూర్తి కథతో సిద్దంగా ఉన్నారు.
ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక ఇందులో నాగ చైతన్య నటించనున్నారట‌. ఆయనకు జోడిగా కృతి శెట్టిని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆమె ఎంపిక ఖరారైపోయిందని తాజాగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి పల్లెవాతావరణంలో ఈ కథ తెరకెక్కనుంది. ఇక అన్నీ సెట్ అయితే ఈ కరోనా పరిస్దితుల నుంచి బయటపడితే, వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని థియేటర్లో విడుదల చేయాలని పక్కా ప్లాన్ లో ఉన్నారు మేక‌ర్స్ . వీరి కాంబోలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here