ప్రతి రోజు స్కూల్ కి వచ్చి పాఠాలు నేర్చుకుంటున్న వింతైన కోతి

ప్రతి రోజు స్కూల్ కి వచ్చి పాఠాలు నేర్చుకుంటున్న వింతైన కోతి

0

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం వెంగళం పల్లి గ్రామంలో ఓ కోతి పిల్లతో స్నేహం చేస్తోంది.. పిల్లలతో పాటు పాఠశాలకు కూడా వెళ్తోంది… ప్రార్థనా సమయంలో స్కూల్ పిల్లలతోపాటు వరుస క్రమంలో నిలబడుతుంది…

అలాగే పిల్లతోపాటు క్లాసులు కూడా శ్రద్దగా వింటోంది ఆ కోతి.. కాళీ సమయంలో పిల్లలతో సరదాగా ఆడుకుంటుంది… అయితే పిల్లలపై ఎప్పుడు దాడి చేయలేదు దింతో పాఠశాల బృందం కూడా దాని తరిమేయలేదు… ప్రతిరోజు స్కూల్ లో శ్రద్దగా పాఠాలు వింటోంది…

దీంతో పిల్లలు కూడా స్కూల్ కు రావడానికి ఎంతో ఇష్టపడుతున్నారు అంటున్నారు… ఆదివారం సెలవు కావడంతో ఒకసారి స్కూల్ కు వచ్చి అక్కడ ఎవ్వరు లేరని నిరాశ చెంది వెంటనే తన స్వగ్రామం అయిన అడవి కొండలకు వెళ్తుంది… ఆ మరుసటి రోజు యధావితదిగా స్కూల్ కి వచ్చి శ్రద్దగా పాఠాలు వింటుంది..