చిరుతో దిల్‌రాజు సినిమా..!!

చిరుతో దిల్‌రాజు సినిమా..!!

0

తెలుగునాట అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నాడు దిల్‌రాజు. ఈ తరం హీరోలందరితోనూ పనిచేశాడు. చేస్తూనే ఉన్నాడు. ఆ తరం హీరోలు వెంకీ ఒక్కడితో సినిమా తీశాడు. చిరు, బాలయ్య లతో దిల్‌రాజు సినిమాలేం చేయలేదు. ఇప్పుడు ఆలోటు కూడా తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు. ముందుగా చిరంజీవితో ఓ సినిమా చేయాలని దిల్‌రాజు ఫిక్సయ్యాడు. సినిమాకి సంబంధించిన ప్రపోజల్‌ని కూడా చిరు ముందుంచాడట. దానికి చిరు కూడా ఓకే అన్నాడని తెలుస్తోంది. చిరు ప్రస్తుతం కొరటాల శివతో తన 152వ సినిమా చేస్తున్నాడు. ఈలోగా దిల్‌రాజు గనుక కథ సిద్ధం చేయించగలిగితే 153వ సినిమా దిల్‌రాజు బ్యానర్‌లోనే ఉంటుంది.

దిల్‌రాజు పవన్‌తో కూడా సినిమా చేయలేదు. `వవన్‌తో సినిమా చేయాలనివుంది` అని రాజు కూడా చాలాసార్లు చెప్పాడు. పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండడం వల్ల రాజు కోరిక నెరవేరలేదు. అందుకే.. చిరుతోనైనా సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. మరి చిరు కోసం దిల్‌రాజు ఎలాంటి కథని సిద్ధం చేయిస్తాడో చూడాలి.