వరుణ్ తో మరో చిత్రం తీయబోతున్న బడా నిర్మాత..!!

వరుణ్ తో మరో చిత్రం తీయబోతున్న బడా నిర్మాత..!!

0

గడ్డలకొండ గణేష్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ఓటమి ఎరుగని హీరోగా దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్.. ఈ సినిమా హిట్ తో తన స్థాయి ని మరో మెట్టు పెంచుకుని వరుణ్ స్టార్ హీరోల జాబితాకు చేరువైపోతున్నాడు.. ఓవైపు యంగ్ హీరోలు సినిమా లు పోగొట్టుకుంటుంటే వరుణ్ మాత్రం తన స్టామినా ని పెంచుకుంటుంది.. ఇకపోతే వరుణ్ హీరో గా దిల్ రాజు మరో సినిమా చేయబోతున్నాడని వార్తలు రాబోతున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో ఫిదా రాగ ఇప్పుడు ఈ సినిమా రావడం గమనార్హం.. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో వరుణ్ తేజ్ – వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ‘తొలిప్రేమ’ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ ను దిల్ రాజు మళ్లీ సెట్ చేసే పనిలో వున్నారని అంటున్నారు. అయితే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం, కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో వుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, దిల్ రాజు ప్రాజెక్టు మొదలవుతుందని అంటున్నారు.