స్టార్ హీరో సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేసిన డింపుల్ హయాతి..

0

ప్రముఖ కధానాయకుడు  నందమూరి  బాలకృష్ణ అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. సీనియర్ హీరోయిన్ల నుండి ముగ్గుగుమ్మల వరకు అందరితో నటించిన ఈ స్టార్ హారో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త  సినిమా తెరెకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరెకెక్కుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో..ఈ సినిమాకు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా..శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్యపై ఓ గీతాన్ని తెరెకెక్కిస్తున్న ఈ పాటలో బాలయ్యతో డింపుల్ హయాతి స్టెప్పులు వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కిలాడి సినిమాలో రవితేజతో డింపుల్ హయాతి అదిరిపోయే స్టెప్పులు వేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే డింపుల్ కి మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో బాలయ్య సినిమాలో ఆఫర్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగే అయినా ఓ రకంగా ఐటమ్ సాంగ్ లా ఈ పాటను తెరకెక్కిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here