ఆహా కోసం ద‌ర్శ‌కుడు మారుతి సినిమా – 30 డేస్ షూటింగ్

Director Maruti Cinema for Aaha - 30 Days Shooting

0

ద‌ర్శ‌కుడు మారుతికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ ని ఆక‌ట్టుకునే సినిమాలు చేస్తారు. త‌ర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేశారు. ఇక ఫ్యామిలీ చిత్రాలు చేయ‌డంలో కూడా త‌న మార్క్ చూపించారు ఆయ‌న‌.ప్రతిరోజూ పండగే సినిమా తరువాత మారుతి పక్కా కమర్షియల్ ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు.

కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కాని తాజాగా ఓ సినిమాని తీస్తున్నార‌ట‌.
ఆహా కోసం ఒక సినిమాను ప్లాన్ చేసుకుని, 30 రోజుల్లో షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేశారు అని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడాస్టార్ట్ అయింది అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో సంతోష్ శోభన్ – మెహ్రీన్ జంటగా నటిస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి,
ఈ సినిమాకి మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే క‌రోనా రాక ముందు క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత అనే కాన్సెప్టుతో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ చాలా స‌ర‌దాగా సాగిపోనుంద‌ట‌. ఇక ఎప్పుడు ఈ చిత్రం వ‌స్తుందా అని మారుతి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here