ఈ వార్త విని దిష కుటుంబం ఏం చేసిందో చూస్తే షాక్

ఈ వార్త విని దిష కుటుంబం ఏం చేసిందో చూస్తే షాక్

0

దిష కేసులో నలుగురు నిందితులని ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. నిందితులని ఎన్ కౌంటర్ చేశారు అని తెలియగానే దిష కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఇన్నిరోజులు కేసు గురించి జాప్యం జరగడంతో తమకు న్యాయం జరగదు అనుకున్నామని, కచ్చితంగా రెండు నెలలకు ఉరిశిక్ష పడుతుంది అని భావించామని ఈలోపు ఇలా వారిని నలుగురిని కాల్చిచంపడం తమ కుటుంబానికి చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

తమ కుమార్తెని చంపిన వారు నలుగురు కూడా మనుషులు కాదని మనిషి రూపంలో ఉన్న జంతువులని సమాజంలో ఇలాంటి వారు ఉండకూడదు అని
పోలీసులు చేసిన చర్య మంచిదే అని దిష తల్లి తెలియచేశారు.. మీడియాకి పోలీసులకి తెలంగాణ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు, తమ వెంట

ఇప్పటి వరకూ సపోర్ట్ గా ఉన్న వారు అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు,

ఇలాంటి ఘటనలలో తన కుమార్తె కొవ్వొత్తులా కరిగి దేశంలో చాలా మందిలో మార్పు తెచ్చింది అని దిష తల్లి తెలియచేశారు. తమకు ముందు పోలీసులు చెప్పలేదని ఇలా జరిగింది అని న్యూస్ చూసి తెలుసుకున్నాం అని తెలియచేశారు దిష కుటుంబ సభ్యులు. ఈ చర్యతో దిశ కుటుంబమే కాదు యావత్

సమాజం కూడా పోలీసులను అభినందిస్తోంది..