వైసీపీ అద్భుత విజయం వెనక మహిళా శక్తి

వైసీపీ అద్భుత విజయం వెనక మహిళా శక్తి..

0

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోవడం యావత్ దేశాన్నే ఆశ్చర్య పరిచింది. అసలు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆసక్తిగా ఇక్కడి రాజకీయాల్ని గమనిస్తున్నారు. బలమైన టీడీపీని అత్యంత బలహీనమైన పార్టీగా మార్చేయడంలో జగన్ సాధించిన విజయం అనిర్వచనీయమైనదంటున్నారు రాజకీయ పండితులు. అయితే జగన్ ఇంతలా గెలవడం వెనక రాయకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటూ… మరో మహిళ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో కాదు… సాక్షి ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి. ఆరు నెలల కిందటే ఆమె వైసీపీకి సోషల్ మీడియా హెడ్ అయ్యారు. అప్పటి నుంచీ రెస్ట్ లేకుండా పనిచేశారు. ఐతే… అప్పటికే టీడీపీ సోషల్ మీడియాలో చాలా ముందుంది. ప్రత్యేక వెబ్‌సైట్‌తోపాటూ… సోషల్ మీడియా సెల్‌ని పెట్టుకొని… ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా కార్యక్రమాలపై జోరుగా ప్రచారం సాగిస్తూ ఉంది. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన దివ్యారెడ్డి… టీడీపీ గొప్పదనం… నిజంగానే ఆ పథకాలన్నీ అమలవుతున్నాయా… టీడీపీ చెబుతున్న వాటిలో నిజానిజాలేంటి? టీడీపీ ఎక్కడెక్కడ ఫెయిలవుతోంది? ఇలా ప్రతీ అంశాన్ని వేర్వేరుగా డీల్ చేస్తూ… ప్రత్యేక సోషల్ మీడియా టీంని డెవలప్ చేశారు. ఆ టీంతో ప్రతి రోజూ కాంటాక్ట్ అవుతూ… ఎలా ముందుకెళ్లాలి. జగన్ చెప్పే మాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలి. పాదయాత్రల్లో హామీలు, నవరత్నాలపై ఎలా ప్రచారం చెయ్యాలి అనే అంశాలపై క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు.జగన్, వైసీపీ గురించి చెప్పడమే కాదు… టీడీపీ కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం, చంద్రబాబు చెప్పే మాటలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వడం, ఇలా ప్రతీ అంశంలోనూ సోషల్ మీడియాలో వైసీపీ దూసుకెళ్లేలా చెయ్యడంలో దివ్యారెడ్డి కృషి ఎంతో ఉంది.

ఎన్నికలు జరగబోయే చివరి నెల రోజుల్లో దివ్యారెడ్డి చేసిన కృషికి పార్టీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ టైంలో జగన్‌తోపాటూ… పార్టీలోని అందరు అభ్యర్థులపై ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు, ప్రొఫైల్స్ చేరేలా దివ్యారెడ్డి బలమైన గ్రౌండ్ వర్క్ చేశారు. ఇలా ఓవైపు ప్రశాంత్ కిషోర్, మరోవైపు దివ్యా రెడ్డి… ఎవరి వంతు వారు గట్టిగా ప్రయత్నించడంతో… చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుందని పార్టీ నాయకులు అంటున్నారు. నిజమే ఎన్నికల ముందు గూగుల్ కూడ ఇదే చెప్పింది ఎన్నికల సందర్భంలో సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ కన్న ముందు ఉందని. అదే ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.